Mahaa Daily Exclusive

  తొలి ఏకాదశి… భక్తులు పరవశించి కాలేశ్వరం లో భక్తుల పుణ్యస్నానం..!

Share

కాటారం, మహా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తొలి ఏకాదశి పండుగను ఆదివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది తర్వాత ప్రజలకు తొలి ఏకాదశి పెద్ద పండుగ. ఆషాడ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు జరుపుకున్నారు. కాలేశ్వరం గోదావరి నదిలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేస్తున్నారు. శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కాలేశ్వరం దేవాలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తులు శివనామస్మరణతో కీర్తించారు. ఆదివారం సెలవు దినం కు తోడు ఏకాదశి పండుగ కావడంతో పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సరస్వతి పుష్కరాలతో కాలేశ్వరం పుణ్యక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజుకు అధికమవుతోంది. గ్రామాలలోని దేవాలయాల్లో ఉదయం నుంచి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం ముక్తేశ్వర ఆలయం, ఘనపూర్ లోని కోటగుల్లు,బొమ్మపూర్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, బొప్పారం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజూరు నగర్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం తో పాటు గ్రామాలలో గల దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు