Mahaa Daily Exclusive

  మహిళలకు సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు: సీఎం రేవంత్‌

Share

TG:రాష్ట్రంలోని మహిళలు సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. HYD రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూసిందని, ఐదేళ్ల పాటు మంత్రివర్గంలో ఒక్క మహిళకూ చోటు ఇవ్వలేదని విమర్శించారు. రాజీవ్‌ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని గుర్తు చేశారు.