చింతకాని మహా : మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన BRS నాయకులు శెట్టి మోహన్ రావు సతీమణి శెట్టి అన్నపూర్ణ కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని MLC తాత మధుసూదన్, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, బిఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బి ఆర్ ఎస్ మాజీ యూత్ ప్రెసిడెంట్ గుండ్లపల్లి శేషగిరి, మండల అధ్యక్షుడు నాయకులు పెంట్యాల పుల్లయ్య BRS నాయకులు కురుగుంట్ల రవీంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ కన్నెబోయిన కుటుంబరావు, గ్రామ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ పిన్నెల్లి శ్రీను తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.
అన్నపూర్ణకు కన్నీటి వీడ్కోలు :
అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి గా మాట్లాడే అన్నపూర్ణ మృతి పట్ల గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి గురై శోకస్ముద్రం లో మునిగి పోయారు. ఆమె మృతిని గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు, నిన్న మొన్నటి వరకు అందరితో కలిసి ఉన్న ఆమె ఒక్కసారి విగత జీవి కావటం తో బంధువులు , స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ సొంత గ్రామమైన రామకృష్ణాపురం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు తెలియజేశారు








