Mahaa Daily Exclusive

  ఆన్ లైన్ బిడ్డింగ్ వేలంలో దుకాణాల కేటాయింపు వేలంలో అత్యధికంగా 42116 వేలు పలికిన దుకాణం..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో నిర్మించిన దుకాణ సముదాయాలను మంగళవారం లైన్ లైన్ బిడ్డింగ్ వేలంలో దక్కించుకున్న వారికి ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, మార్కెట్ జిల్లా అధికారుల సమక్షంలో దుకాణాలను కేటాయించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణ సముదాయాలకు (e-ఆక్షన్) వేలం నిర్వహించి, రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 3, ఎస్టిలకు 2, దివ్యాంగులకు1, బీసీలకు 5, ఇతరులకు 6 దుకాణాలను కేటాయించారు. సుమారు 163 మంది బిడ్డింగ్ వేయగా అత్యధికంగా రూ. 42116 వేలకి ఒకటో నెంబరు దుకాణాన్ని, చిలుకూరి నరేందర్ జనరల్ కోటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ జిల్లా అధికారులు ఉప్పర్ గూడ పిఎసిఎస్ చైర్మన్ ఏదుల పాండురంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యాల రాజశేఖర్ రావు, ఏఎంసి వైస్ చైర్మన్ మంకాల కర్ణాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజు, మహేష్, రాఘవేందర్, మార్కెట్ కమిటీ సెక్రటరీ సంతోష్, తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో నిర్మించిన 17 దుకాణ సముదాయాలను గత నెలలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి విధితమే.

Latest