రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యంగా, ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి, నజ్లిక్ సింగారం, తక్కలపల్లి, అయ్యావారిగూడెం, కొత్తపల్లి, యాచారం గ్రామాలలో కోటి 89 లక్షల నిధులతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తపల్లి గ్రామంలో తాగునీరు రావడంలేదని, ఇందిరమ్మ ఇండ్లు అందలేదని, గృహజ్యోతి ఇవ్వలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, తక్షణమే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించిందన్నారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో రాధా రాణి, ఎంపీఓ శ్రీలత, ఏవో రవినాథ్, కాంగ్రెస్ నాయకులు బిలకంటి శేఖర్ రెడ్డి, రాచర్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, వరికుప్పల సుధాకర్, కంబా లపల్లి ఉదయశ్రీ పాల్గొన్నారు.








