ఆదిలాబాద్, మహా
ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న యూరియాను తెలంగాణ రైతులకు అమ్మకుండా,అక్రమంగా మహారాష్ట్రకు అధిక ధరలకు అమ్ముతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.బేల మండలంలోని మార్క్ ఫెడ్ అనుబంధ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హకా) ప్రొప్రైటర్ సునీల్,ఉద్యోగి అజయ్ లు మహారాష్ట్రకు సంబంధించిన ఫెర్టిలైజర్ దుకాణం యజమాని నిఖిల్ తో ఒప్పందం కుదుర్చుకొని దాదాపు రూ.3 లక్షల విలువచేసే యూరియాను 2 వాహనాలలో 150 బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తుండగా రెండు వాహనాలను సీజ్ చేసి, వాహన డ్రైవర్ లైన వాంకడే దిలీప్,చిలకలవార్ చంద్రశేఖర్ తో పాటు ఐదుగురిపై బేల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు తెలిపారు.ప్రత్యేకంగా రైతుల ద్వారా సమాచారం అందగా త్వరితగతిన స్పందించి జైనథ్ సీఐ సాయినాథ్,బేల ఎస్సై నాగనాథ్ బృందం వారిని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు








