ఆదిలాబాద్, మహా
పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే ఔత్సాహికులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షాహిద్ అహమ్మద్ తవక్కల్ సూచించారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 2026 సంవత్సరంలో హాజ్ యాత్రికుల కోసం ఉచిత ఆన్లైన్ దరఖాస్తులను చేపడుతున్నామని తెలిపారు. యాత్రకు వెళ్లేవారు తమ వివరాలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఈనెల 31 తేదీ లోపు అందించాలని సూచించారు. యాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్న వారు ఇంటర్నేషనల్ పాస్ పోర్ట్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, రెండు పాస్ ఫోటోలలతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఉచితంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేపడతామని పేర్కొన్నారు. సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ముహమ్మద్ అసిఫ్ ఉద్దీన్, జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ అబ్దుల్ హసీబ్, సభ్యులు జఫియుల్లా ఖాన్, ఫారుక్ అహ్మద్, డాక్టర్ అతర్ షరీఫ్ ఉన్నా







