Mahaa Daily Exclusive

  విద్యతో ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిపిటిఎల్ఎఫ్ నాయకులు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై, విద్యశాఖ కమీషనర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ కు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిపిటిఎల్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందించడం జరిగింది. రాష్ట్రంలో విద్యతో ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీకి తెగబడ్డాయని, ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని విద్యాశాఖ కమిషనర్ను డిమాండ్ చేయడం జరిగింది. జిల్లాలలోని విద్యాశాఖ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యవస్థను వ్యాపారం చేసి డబ్బులు దండుకుంటున్నారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. అనేక రకాల విద్యా విధానాలను చూపిస్తూ, ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరనైనది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా అధికారులు ఉండాలని అన్నారు.

పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదు…
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు 70% మాత్రమే విద్యార్థులకు వచ్చాయని, మిగతా పెండింగ్ పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరడం జరిగింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థలలో, పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని ప్రత్యేక చట్టం చేయాలని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర ఉద్యోగులకు ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా ఉద్యోగ భద్రత కల్పించి, రెండవ శనివారం సెలవులు ఇవ్వాలని సూచించారు.

హామీ ఇచ్చిన విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్….
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిపిటిఎల్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు అందించిన వినతి పత్రంతో,
సానుకూలంగా స్పందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, ఉపాధ్యక్షులు డి.కిరణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.రమేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హస్మిబాబు, టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు, కొమ్ము విజయ్, సైదులు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Latest