వరంగల్ మహా;
వరంగల్ సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ ఎల్లంబజార్లోని సాయి సేవాదళ్ మందిరంలో గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా సాయి సేవాదళ్ ఆధ్వర్యంలో 24 గంటలు ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అఖండ ఏకనామ మహా యజ్ఞంతో పాటు సాయి నాధుడికి వివిధ రకాల ఫలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమానికి ట్రాఫిక్& లాండ్ అడిషనల్ డిసిపి రాయల ప్రభాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు వడ్డించారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం పల్లకి సేవను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సాయి సేవాదళ్ అధ్యక్షులు ఆరుట్ల శ్రీనివాస్, ఇరుకుల నాగేశ్వరరావు, పబ్బా కిషోర్, ఉమా మహేశ్వర గురుస్వామి తోపాటు సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 29








