Mahaa Daily Exclusive

  దేవాలయాల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు దన్వాడ లో టీపిసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ..!

Share

కాటారం, మహా: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు గురువారం నిర్వహించారు. షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయం లలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు ఉదయం నుండి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్తాభిషేకం నిర్వహించచారు. ఈ కార్యక్రమంలో దుద్దిళ్ళ శ్రీనుబాబు దంపతులు పాల్గొని దత్తాత్రేయ స్వామికి అభిషేకం, సహస్ర నామ అర్చన, మంగళ హారతి,మంత్ర పుష్పం,తీర్థ ప్రసాద వితరణ,నిర్వహించారు,రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్టు శ్రీనుబాబు తెలిపారు,అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు,శ్రీపాద వల్లభుడైన దత్తాత్రేయ స్వామి ఆలయ క్షేత్రంలో ప్రత్యేక భజనలతోపాటు అన్నదానం నిర్వహించారు. పెద్ద పుణ్యక్షేత్రమైన కాలేశ్వరంలో ముక్తేశ్వర స్వామి అనుబంధం దేవాలయమైన దత్తాత్రేయ స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకులు పనకంటి పనింద్ర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు , వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ప్రధాన దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ శుభానంద దేవి అమ్మవారికి, శ్రీ మహా సరస్వతి అమ్మవారికి శాఖాంబరి అలంకరణలు చేశారు. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీముఖిశ్వర స్వామికి అభిషేకములు పూజలు నిర్వహించి ఆకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు.

గణపురం లో గురుపౌర్ణమి వేడుకలు.. ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి లాభాపేక్ష, ఏది ఆశించకుండా గురువు తన శిష్యుడికి విద్యను నేర్పిస్తారు. దాంతో శిష్యుడు తన సర్వస్వం గురువుకే అంకితం చేస్తాడని ఎమ్మెల్యే అన్నారు. ఇదీ గురు శిష్యుల సంబంధం, ఏ రకమైన పేగుబంధం లేని పరమాత్మ సంబంధమని పేర్కొన్నారు. గురువులను ప్రతి విద్యార్థి గౌరవించుకునేందుకు కృషి చేయాలని, అప్పుడే సంస్కారవంతమైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థులు గురువు బాటలో నడిస్తే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అందుకునేందుకు వీలుంటుందని తెలిపారు.

Latest