Mahaa Daily Exclusive

  ఇది చరిత్రాత్మక నిర్ణయం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నాం క్యాబినెట్ నిర్ణయాలపై టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ హర్షం..!

Share

హైదరాబాద్, మహా: ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు అని పేర్కొన్నారు. క్యాబినెట్‌లో బీసీ రిజర్వేషన్లు అమలు కోసం ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు. 2018 చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సామాజిక విప్లవానికి నాంది అని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చేసిన డిమాండ్‌ను దేశంలో మొదటగా తెలంగాణలో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం, ప్రధానంగా బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.

Latest