హైదరాబాద్, మహా: మాజీ సీఎం కేసీఆర్‌ను ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయనకు యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం హైదరాబాద్‌లో నందినగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. వైద్యుల సూచనలతో గురువారం ఉదయం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేరారు. దీంతో ఆయనకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అసలు అయితే.. జులై 3వ తేదీన కేసీఆర్ అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు పరిశీలించేందుకు రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలంటూ ఆయనకు వైద్యులు సూచించారు.దీంతో ఆయన యశోదలో చేరారు. ఆరోగ్యం కుదుటపడడంతో రెండు రోజులకే అంటే.. జులై 5వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని.. ఆ తర్వాత మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని మాజీ సీఎం కేసీఆర్‌కు వైద్యులు సూచించారు. దాంతో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ గురువారం యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.








