ఏపీలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని పరిశీలించిన తర్వాత సంతృప్త స్థాయిలో ఉంటే హాల్టింగ్ ను పొడిగిస్తారు. లేదంటే కేవలం ఆరు నెలలకు లేదంటే ఏడాది కాలం వరకు పరిమితం చేస్తారు. ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ లోపు దశలవారీగా హాల్టింగ్ సౌకర్యం ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం ఈ క్రింద పేర్కొన్న స్టేషన్లలో ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను నిలుపుతారు. అలాగే ఆదాయంతోపాటు ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంటే వీటిని అలాగే కొనసాగించడానికి అవకాశం ఉంది. దీనికి ఆయా ప్రాంతాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులతో రికమండేషన్ చేయించాల్సి ఉంటుంది. ఏయే స్టేషన్లలో ఏ రైళ్లు ఆగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకాశం జిల్లా చినగంజాం రైల్వే స్టేషన్‌లో పూరి-తిరుపతి (17479) తిరుపతి-కాకినాడ టౌన్ (17249) బిలాస్‌పూర్-తిరుపతి (17481) రైళ్లు ఆగుతాయి.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి స్టేషన్లలో భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైళ్లు ఆగుతాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలో లింగంపల్లి- నర్సాపూర్ (17256) చెంగల్పట్టు-కాకినాడ (17643)
ప్రకాశం జిల్లా గిద్దలూరు స్టేషన్‌లో ధర్మవరం-రేపల్లె (17216) ఆగుతుంది.
సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లలో నాగర్‌సోల్-నర్సాపూర్ (17232) రైలు ఆగుతుంది.
భీమడోలు స్టేషన్ లో గుంటూరు-రాయగడ (17243)
పుట్లచెరువు స్టేషన్ లో గుంటూరు-నరసాపూర్ (17281)
గూడూరు జంక్షన్‌లో కాత్రా-కన్యాకుమారి (16318)
పసివేదల స్టేషన్‌లో విజయవాడ-కాకినాడ పోర్టు (17257)
ఉప్పులూరు స్టేషన్ లో విజయవాడ-మచిలీపట్నం ( 07866)
మార్కాపురం రోడ్డు స్టేషన్‌లో ధర్మవరం-మచిలీపట్నం (17216)
న్యూ గుంటూరు స్టేషన్‌లో చెంగల్పట్టు-కాకినాడ (17643)
కంభం స్టేషన్‌లో యశ్వంత్‌పూర్-మచిలీపట్నం (17212)








