Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకూ కోటా ఇవ్వాలి ఎమ్మెల్యేల మాదిరిగా శాతం కోటా కేటాయించాలిసీఎం రేవంత్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లేఖ..!

Share

హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో ఎంపీలకు 40 శాతం కోటా కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు రఘునందన్ రావు బహిరంగ లేఖ రాస్తూ.. రాష్ట్రంలోని పేదలు, బలహీన వర్గాల ప్రజలకు నూతన గృహాలను అందించేందుకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ప్రారంభించేందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులను అనుసంధానించడం సానుకూలమైన పరిణామం అని అన్నారు.

మాకూ 40 శాతం కోటా..
ఇప్పుడు మీరు లబ్ధిదారుల ఎంపికలో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలకు 40 శాతం కోటా కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడంలో ఈ నిర్ణయం కీలకమైనదన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన తెలంగాణ రాష్ట్రంలోని 17 మంది లోక్ సభ్యులకు కూడా మరో 40 శాతం కోటా కేటాయించగలరని రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం పార్టీపరమైన విషయాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలను కల్పించడమే కాకుండా, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగేందుకు దోహదపడుతుందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రిగా మీరు త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుని ఎంపీలను కూడా గౌరవిస్తూ ఈ విషయంలో న్యాయమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు లేఖలో ప్రస్తవించారు.

Latest