హైదరాబాద్, మహా: గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు – స్వదేశీ మేళలో భాగంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఈ సదస్సు స్వదేశీ మేళలో భాగంగా గాంధీ విగ్రహాల ప్రదర్శన, చరఖా అవార్డుల ప్రధానోత్సవం, చరఖాల ప్రదర్శనలు నిర్వహించనున్నారని తెలిపారు. కొన్ని శక్తులు గాంధీ, నెహ్రూలను ప్రజల మనసుల నుంచి తుడిచిపెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశ చరిత్రను మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహాత్మా గాంధీ ఆశయాలు ప్రజల హృదయాల్లో నాటుకుపోయాయని, వాటిని చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదని, ప్రతి ఒక్కరికీ గాంధీ మార్గమే శరణ్యమని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
Post Views: 40








