Mahaa Daily Exclusive

  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దాడిపై బీసీ కమిషన్ కు ఫిర్యాదు..!

Share

మహా మిర్యాలగూడ బీసీలను ఏకం చేసి వారికి రాజ్యాంగ పర పదవులు దక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్న పన్నుల నుంచి సంక్షేమం రిజర్వేషన్ల పేరిట బీసీలు వాటాలను పొందే విధంగా చైతన్య పరుస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జాగృతి సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేయటాన్ని బీసీ సమాజం సహించబోధని బీసీ ఉద్యోగ సంఘాల నేత, ఎమ్మెల్సీ మల్లన్న వ్యక్తిసహాయకులు బొమ్మనబోయిన శ్రీనివాస్ అన్నారు. సోమవారం జాగృతి నేతలు క్యూ న్యూస్ ఆఫీస్ కు చేరుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సిబ్బందిపై దాడి చేసి గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్ లకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వెనుకబాటుకు నెట్టి వేయబడిన బీసీ ఇతర సామాజిక వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కాలని మల్లన్న చేస్తున్న పోరాటం ప్రజలు గుర్తించి ఎక్కడికి వెళ్లిన అతనికి ఘన స్వాగతం పలుకుతూ తమ నాయకుడు వచ్చాడని భరోసాగా ఉంటున్న వేళ జాగృతి నేతలు బీసీ సమాజాన్ని భయపెట్టించేమీ విధంగా కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు క్యూ న్యూస్ ఆఫీసులో విధ్వంసం చేశారని మండిపడ్డారు. బీసీ సమాజంపై అటాక్ చేస్తే ఉద్యమం ఆగక పోగా మరింత ఉధృతంగా మారుతుందన్నారు. రానున్న రోజుల్లో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టడం ఖాయమని ఇలాంటి దాడలకు ప్రయత్నిస్తే పరిణామాల తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట కడారి వెంకట్ యాదవ్ ఉన్నారు.

Latest