వరంగల్ మహా;
ఇటీవల కౌన్సిల్ లో ప్రస్తావించిన సమస్యల పరిష్కారం పై శ్రద్ధ చూపాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ ఫిర్యాదుల సమీక్ష పై నిర్వహించిన సమావేశంలో కమిషనర్ అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు వివిధ సమస్యల నిమిత్తం అధికారులకు ఫోన్ చేసే క్రమంలో అధికారులు స్పందించాలని, ఇటీవల శానిటేషన్ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలలో బదిలీలు జరిగిన క్రమంలో అంతర్జాలంలో అట్టి సమాచారాన్ని సవరించాలని, గ్రీవెన్స్ కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో అట్టి సమస్య గురించి క్షేత్రస్థాయిలో అధికారులు సందర్శించి పరిశీలన చేసి పరిష్కరించిన తర్వాతనే డాష్ బోర్డు నుండి తొలగించాలని, సెల్ఫ్ అసెస్మెంట్ లు మ్యుటేషన్ లకు సంబంధించి కనీసం 5% క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేయాలని అన్నారు.ఈ సందర్భం గా టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ శానిటేషన్ మలేరియా విభాగాలకు సంబంధించి గత ప్రజావాణి కార్యక్రమం లో స్వీకరించిన ఫిర్యాదులు ఇంతవరకు ఎన్ని పరిష్కారం అయ్యాయి, మిగిలినవి ఎందుకు చేయలేకపోయారు అనే విషయాలను అడిగి తెలుసుకొని వేగవంతం గా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి డి ఎఫ్ ఓ శంకర్ లింగం వెటర్నరీ వైద్యులు డా.గోపాల్ రావు పన్నుల అధికారి రామకృష్ణ ఇన్చార్జి ఎస్ ఈ, సిటీ ప్లానర్ లు మహీందర్ రవీందర్ రాడేకర్ హెచ్ ఓ లు రమేష్ లక్ష్మారెడ్డి డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి ఏం హెచ్ ఓ డా.రాజేష్ హెచ్ ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు








