Mahaa Daily Exclusive

  యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ గ‌ర్ల్‌ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య..కేసు నమోదు చేసిన పోలీసులు ..!

Share

హన్మకొండ మహా;

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో పరిచయమైన ఓ మహిళ కారణంగా యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తో హనుమకొండ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
హన్మకొండ జిల్లా హసన్ పర్తి కి చెందిన డాక్టర్ ప్రత్యూష ను డాక్టర్ సృజన్ (కార్డియాలజిస్ట్) 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే శృతి(బుట్ట బొమ్మ)తో డాక్టర్ సృజన్ ప్రేమలో పడ్డారు. దీంతో వీరి కాపురంలో బుట్ట బొమ్మ కాస్త చిచ్చు రేపింది.
బుట్ట బొమ్మ ప్రేమలో ప‌డ్డ సృజన్ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భార్య డాక్టర్ ప్రత్యూష మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. కాగా
సృజన్ తన కూతురిని హింసించాడని అందుకే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రత్యూష తండ్రి హాసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సృజన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Latest