రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇండ్ల స్థలాలు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ (సిపిఎం) పార్టీ, రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్యాలయ ప్రవేశం వద్ద నిర్వహించిన ధర్నాకు, ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ… హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిల్స్ దిన కూలీలుగా, అసంఘటిత రంగ కార్మికులుగా, ఇంటి పనివారలుగా , ఇతర పనులు కార్మికులకు చాలీచాలని కూలీతో జీవనం గడపడం కష్టంగా మారిందన్నారు. కూలీలు కార్మికులు అద్దె ఇళ్లల్లో ఉండి వచ్చిన కూలి డబ్బులు అద్దెలకే చెల్లిస్తూ వాళ్ల జీవనం అధ్వానంగా ఉందని మనుగడ కష్టంగా మారింది. ప్రభుత్వం కార్మికులకు కూలీలకు బడుగు బలహీన వర్గాలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు వెచ్చించి సర్కార్ అదుకోవాలని, ప్రభుత్వం సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మనవి పత్రం అందజేసి వేడుకోవడం జరుగుతుందని అన్నారు.
అన్యాక్రాంతం అవుతున్న సర్కారు భూములు….
రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్, ఆమనగల్లు మండలాల పరిధిలోని ప్రభుత్వ సర్కార్ అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిని కాపాడాలని వినతి పత్రం అందజేశారు చేశారు. హయత్ నగర్ మండలములోని సాహెబ్ నగర్ కలాన్ కు సంబంధించిన సర్వే నెంబర్ 71,162, హయత్ నగర్, కుంట్లూర్ మధ్యన గల భూమి సర్వే నెంబర్ 308 ఆమె కొత్త నెంబర్ సృష్టించి 13 ఎకరాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి అన్యాక్రాంతం చేయడం జరుగుతుందని, అలాగే అమనగల్లు మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 191,40, 27లలో 5 ఎకరాలు జిల్లా దాఖల్ (2 గ్రామాల సరిహద్దు) గ్రామాల మధ్యన ఉన్న సర్కార్ భూమి అన్నారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను స్వాధీనపరచుకొని ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. చంద్రమోహన్, సిపిఎం నేతలు కీసర నర్సిరెడ్డి, ఆలేటి ఎల్లయ్య, సిహెచ్ వెంకన్న, మహిళా నాయకురాలు, పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.








