Mahaa Daily Exclusive

  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ సమయపాలన పాటించక పోతే చర్యలు తప్పవు ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరం రంగశాయిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యాధికారులను , వైద్య సిబ్బందిని ప్రజలకు అందించవలసిన వైద్య సేవలు, సమయపాలన గురించి వివరించడం తో పాటు
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీలు, వ్యాధి నిరోధక టీకాలు, అందించాలని సూచించారు. ముఖ్యంగా
అనవసరమైన శస్త్రచికిత్సలు చేయకుండా సాధారణ ప్రసవాలు అయ్యేవిధంగా గర్భిణీ స్త్రీలను ప్రోత్సహించాలని కోరారు. అంతేకాకుండా
సంక్రమిత వ్యాధులు, అసంక్రమిత వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు చేయించి తగిన చికిత్సలు అందించాలని అలాగే
క్యాన్సర్, పాలియాటివ్ కేర్ సర్వేలో గుర్తించిన వారికి సేవలు అందించాలని వర్షాకాలంలో మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ చికెన్ గున్యా మెదడువాపు తీవ్రమైన నీళ్ల విరోచనాలు, జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుచేత ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కలుషితమైన నీటిని, ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని సూచించారు. సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కొమురయ్య, స్థానిక వైద్యాధికారి డాక్టర్ రమ్య, సీసీ నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Latest