Mahaa Daily Exclusive

  మండల బ్లాక్ జిల్లా కాంగ్రెస్ కమిటీలు వాయిదా. ..!

Share

కాటారం, మహా :
పార్టీ సంస్థాగత ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆదివారం గాంధీభవన్లో ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ। మండల, బ్లాకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలను స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వరకు నిలుపుదల చేస్తూ అందరి అభిప్రాయాల మేరకు నిర్మాణం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత కాంగ్రెస్ సంస్థ గత ఎన్నికల నిర్మాణం చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగినట్లు జయశంకర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపినారు.

Latest