Mahaa Daily Exclusive

  యూనివర్సిటీ భూములు కాపాడండి జస్టిస్ చంద్రకుమార్ కు విద్యార్థి సంఘాలు వినతిపత్రం అందజేత..!

Share

హన్మకొండ మహా;

కాకతీయ యూనివర్సిటి భూములను కాపాడాలని, యూనివర్సిటీ భూములలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టవద్దని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రీటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ కి భవిష్యత్తులో మరిన్ని కోర్సులు అందుబాటులోకి వస్తాయని వాటికీ అనుగుణంగా భవనాలు, విద్యార్థులకు సరిపడా హాస్టల్స్, నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు చాలా వరకు భూములు అవసరం పడతాయి కావున ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణం కోసం యూనివర్సిటీ పాలకమండలి 15 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భవిష్యత్తు యూనివర్సిటీ అవసరాల దృష్ట్యా రెసిడెన్షియల్ స్కూల్ ను ఇతర ప్రభుత్వ భూములలో నిర్మాణం చేపట్టాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, డిఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పిడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఎస్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్, ఏఐడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ లతోపాటు విద్యార్థి సంఘ నాయకులు ఉప్పుల శివ, రాజు, చెట్టుపల్లి శివ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest