Mahaa Daily Exclusive

  మానవాళి జీవనశైలి కోసం మొక్కలు నాటాలి మొక్కల సంరక్షణ బాధ్యత మనపై ఉండాలి డిసిసిబి చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
సమాజం శ్రేయస్ కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని డీసీసీబీ చైర్మన్, టె స్కాబ్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య అన్నారు. సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీసీసీబీ చైర్మన్ సత్తయ్య మున్సిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డితో కలిసి మొక్కలను నాటారు. అనంతరం అయన మాట్లాడుతూ… వాతావరణంలో మారుతున్న పరిస్థితులు మానవాళి జీవనశైలి, మనుగడ మీద ప్రభావం చూపడం జరుగుతుంది. వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో దోహదపడుతాయని, సమాజం శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాం రెడ్డి, తురుకయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుమాజీ కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ, అయ్యప్ప దేవస్థానం కమిటీ సభ్యులు నర్సింహ, అశోక్ గౌడ్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest