ఇల్లెందు, మహా.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో, సోమవారం మున్సిపల్ కార్యాలయం సీతారామ టాకీస్ వాటర్ సప్లై మాస్టర్ అడ్డాల వద్దజనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీ లో టియుసిఐ జిల్లా కార్యదర్శి యాకుబ్ షావలి పార్టీ పట్టణ కార్యదర్శి పాయం వెంకన్న మున్సిపల్ జిల్లా కార్యదర్శి వేముల గురునాథం పాల్గొని మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పార్టీ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ ఆనాడు ఇచ్చిన పిలుపులో పార్టీ కేంద్ర కమిటీ నాయకులు రాయల చంద్రశేఖర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు గండి యాదన్నలు బ్రతికున్నంత కాలం ఆదివాసి గిరిజన గిరిజనేతరుల భూమి భుక్తి కోసం పనిచేశారని ఆన్నారు. ముఖ్యంగా భూమి లేని నిరుపేదలకు భూమి కావాలని చెరువులు కుంటలు పోయించారని గుర్తు చేశారు. పార్టీ ఎక్కడ పని చేయమని కోరితే అక్కడకి వెళ్లి పని చేశారని గుర్తు చేశారు.
అనేక జైలు జీవితాలు నిర్బంధాలు చిత్రహింసలు ఎదుర్కొని ఈ ప్రజల కోసం పని చేశారని అన్నారు. ఇల్లందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వారి స్మారక స్థూపాలను ఈ నెల 16న ఇల్లందులోని జెకె బస్ స్టాప్ వద్ద ఆవిష్కరణ ఉందని ఈ సందర్భంగా ప్రదర్శన ఎల్లన్న భవనంలో స్తూపవిష్కరణ సభ ఉంటుందని విప్లవ అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.







