ఇల్లెందు, మహా.
ఇల్లందు పట్టణంలోని 21, వార్డు లోని సబ్ జైల్ బస్తి, లోని మజీద్ కట్టి పది సంవత్సరాలు అయిన సందర్భంగా సోమవారం మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బస్తీలోని ప్రజలు అందరూ కలిసి కుల మతాలకతీతంగా సాఫంతి భోజనాలు మజీద్ లోనే చేయడం జరిగిందనీ మజీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ సిరాజ్ అన్నారు.అనంతరం మజీద్ కు హాజరైన, ఇమామ్ సాబ్ పర్వేజ్, షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ సమాజంలో పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఒకరి పట్ల ఒకరు స్నేహభా
వంతో మెదిలే విధంగా చూడాలన్నారు. ప్రత్యేకంగా పిల్లల యెడల తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉండాలని గుర్తు చేశారు. ఈరోజు టచ్ సెల్లుల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా పిల్లలను ప్రభావి
తం చేస్తుందన్నారు. పిల్లలు తప్పుడు అలవాట్లకు అలవాటు పడి తమ నిండు జీవితాలనిచెడగొట్టుకుంటున్నారని కన్న తల్లిదండ్రులకు చెడు పేరు తెచ్చే విధంగా ఉందన్నారు. కొంతమంది హిందూ ముస్లింల మధ్య తగాధగా సృష్టించి, తన్నుకు సావండని తమాషా చూస్తున్నారనీ అన్నారు. వాట్సాప్ లో కులాలకు మతాలకు వ్యతిరేకంగా పోస్టులు కల్పితం చేసి ప్రశాంత వాతావరణన్ని భగ్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఈ దేశంలో అన్ని కుల మతాలను సమానంగా గౌరవించుకోవాలని ఇది అత్యంత సున్నితమైన విషయమని వారు స్పష్టం చేశారు.ఎవరు చెడు చేసిన దండించాలి తప్ప తప్పుని ఏ కులం వారు చేసినా తప్పుగానే చూడాలి తప్ప అది కులమ
తాలకు అంటియవద్దని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సదర్, ఇమామ్ సాఫ్ మౌజన్ లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో మజీద్ మౌజన్ సయ్యద్, రంజాన్, ఫక్రుద్దీన్, మొహమ్మద్ రఫీ ఫయాజ్, ఎండి రహీం మస్తాన్ గౌస్ సార్ హైమద్ అక్రమ్ నజీర్, హలీం యాకుబ్ పాషా, సయ్యద్ ఆటో పాషా హుస్సేన్, షేక్ కలీం తదితరులు పాల్గొన్నారు.








