ఇల్లెందు, మహా.
సీతారామ ప్రాజెక్టు లో భద్రాది కొత్తగూడెం జిల్లాకు అన్యాయం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్. కె. సాబీర్ భాష అన్నారు. సోమవారం 21 ఏరియా లోని కొవ్వూరి రాయలింగు సభా ప్రాంగణంలో జరిగిన 19వ సిపిఐ మండల మహాసభలో ఎస్. కె. సాబీర్ పాషా మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ ద్వారా ఇల్లందు, డోర్నకల్ మహబూబాబాద్, పినపాక నియోజకవర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో సిపిఐ పాత్ర ఎంతో ఉందన్నారు. డిసెంబర్ 26న సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. 21 ఏరియాకి సిపిఐ కి కంచుకోట లాంటిదని, ఎంతోమంది సిపిఐ నాయకులు 21 ఏరియా తయారుచేసిందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలకు అన్యాయం చేయడానికి చూస్తుందన్నారు. అఖిలపక్ష నాయకులు జులై 9న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో 25 కోట్లకు పైగా సంఘటిత, అసంఘటిత కార్మికులు రోడ్లపైకి రావడంతో బిజెపి ప్రభుత్వం భయాందోళనకు గురైందన్నారు. సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికునికి ధన్యవాదాలు తెలిపారు. బిజెపి ప్రభుత్వంలో ప్రజలు వాడే నిత్యవసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అదాని, అంబానీలకు కట్టబెట్టి ప్రైవేటుపరం చేయడానికి బిజెపి ప్రభుత్వం చూస్తుందన్నారు. దేశంలో 37% ఓట్లతో గెలిచిన బిజెపి ప్రభుత్వం, కార్మిక సంఘాలకు 51% మద్దతు ఉంటేనే కొనసాగుతాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసి ప్రజలు రెండు వేల మందికి పైగా బిజెపి దహన కాండకు మృతి చెందారన్నారు. 2026 మార్చి లోపు మావోయి
స్టులను అంతం చేయడం కాదు, 2026 లోపు దేశంలో విద్య, వైద్యం, రైతుల గిట్టుబాటు ధర అందించాలన్నారు. మణుగూరు ఏరియాలో ఓసి నిర్వాసితులకు ప్యాకేజీ ఇచ్చిన విధంగానే పూసపల్లి ఓసి లో నిర్వాసిత ప్రాంతాలైన 21 ఏరియా, పూసపెల్లి, తిలక్ నగర్, విజయలక్ష్మి నగర్, 24 ఏరియా వాసులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపచేయాలని, 2019 సింగరేణి చట్టం అమలు చేయాలని కోరారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో సింగరేణి నిర్వాసిత ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఇల్లందును రెవెన్యూ డివిజన్ గా, బోడు, కొమరారం మండలాలను ఏర్పాటు చేయాలన్నారు. సిపిఐ అధికార పార్టీతో కలిసి ఉన్న ప్రజలు ఎదుర్కొనే ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మిర్యాల రంగయ్య, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేవరకొండ శంకర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, సిపిఐ పట్టణ కార్యదర్శి బాస శ్రీనివాస్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బంధం నాగయ్య, ఇల్లందు పట్టణ మహిళ కార్యదర్శి కమటం చంద్రకళ, ఇల్లందు మండల మహిళా కార్యదర్శి తడికల శ్రీలక్ష్మి, ఉడుత ఐలయ్య, వడ్ల శీను సుందర్, తదితరులు పాల్గొన్నారు.








