AP: వైఎస్ షర్మిలకు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి క్రిష్ణ మోహన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత మాజీ సీఎం రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ తో సుదీర్ఘకాలం అనుబంధం ఆయనకు ఉంది. టీడీపీ, వైసీపీలలో కీలక పాత్ర పోషించిన ఆయన త్వరలో మళ్ళీ జగన్ గూటికి చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే చీరాలలో వైసీపీ మళ్ళి పుంజుకునే అవకాశం ఉంది.
Post Views: 95








