మధిర, మహా.
మధిర మండలం రాయపట్నం గ్రామంలో ఇల్లు లేని పేదల కోసం మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కృషి ఫలితంగా ఈ ఇళ్ల మంజూరు జరిగింది.ఈ సందర్భంగా అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ – “పాదయాత్రలో భట్టి విక్రమార్క గారికి పేదల ఇళ్ల సమస్య చెప్పిన సమయంలో ఇచ్చిన హామీని నేడు నెరవేర్చడం గర్వకారణం. ప్రతి అర్హుడికి ఇల్లు మంజూరు చేయడం పేదలకు పండుగ వాతావరణం తేవడం వంటిదే,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, సహకార సంఘాల డైరెక్టర్లు అద్దంకి రవికుమార్, అల్లాడి గోపాలరావు, గ్రామ మాజీ సర్పంచ్ బొమ్మకంటి హరిబాబు, నిడామనూరి వంశి, కర్నాటి రామారావు, చిలువేరు బుచ్చయ్య, పులిబండ్ల చిట్టిబాబు, ఆవుల ఝాన్సికిరణ్, అదూరి శ్రీను, బిట్రా ఉద్దండు, శాసనాల శ్రీను, యాడ్ల సాంబయ్య, యాడ్ల పూర్ణయ్య, ఆవుల శ్రీనివాసరావు, పార్శపు జంగమ్మ, కోట రవిచంద్ర భూపాల్, గోళ్ళ ఉద్దండయ్య, మాగంటి జంపయ్య, దూదేకుల జాని, సంగెపు రేణుక, సాతులూరి నాగభూషణం, తుమ్మలపల్లి మురళి, కటారపు సుభాష్ చంద్రబోస్, జింకల రామకృష్ణ, గుగ్గిలపు నాగరాజు, పార్శపు లబాన్, నాని, ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఇంజినీరు అక్తార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్థులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.







