మహా భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి ఫీజులను వసూలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ వినియోగదారులు, మానవ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చెట్టి జస్వంత్ భద్రాచలం విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా చెట్టి జస్వంత్ మాట్లాడుతూ, భద్రాచలంలో కార్పొరేట్ స్కూల్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్య చట్టాలను గౌరవించడం లేదని అన్నారు, విద్యాహక్కు చట్టం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో 25% ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల పిల్లలకు జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన ఆదేశాలనుసారం ప్రైవేట్ పాఠశాలలు ఫీజులలో 50% రాయతీ కల్పించాలనిఅన్నారు.
Post Views: 39








