Mahaa Daily Exclusive

  రేపు కూసుమంచిలో ఇందిరా శక్తి సంబరాలు హాజరుకానున్న మంత్రి పొంగులేటి..!

Share

కూసుమంచి, జులై 15, మహా:

కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఇందిర శక్తి సంబరాలు కార్యక్రమం జరగనుంది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి స్వయం సహాయక బృందాలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాగా కార్యక్రమంకు సంబంధించిన పనులను కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్ఐ నాగరాజు, క్యాంప్ కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామసహయం వెంకట్ రెడ్డి, మాదాసు ఉపేందర్ రావు, బారి వీరభద్రం, కంచర్ల జీవన్ రెడ్డి, వడిత్య సెట్ రాం, నాగిరెడ్డి రంగారెడ్డి, యూత్ విభగం బెల్లంకొండ కిరణ్, కొండ మహిపాల్, వడిత్య కుమార్, శేఖర్ రెడ్డి, మొహమ్మద్ రఫీ పాల్గొన్నారు.

Latest