ఆదిలాబాద్, మహా
ఆదివాసులకు ఇబ్బందికరంగా మారిన జీవో 49 ని రద్దుచేయాలని కోరుతూ తేదీ ఈ నెల 21న ఆదివాసీ సంఘాలు తలపెట్టిన ఏజెన్సీ బంద్ కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు ) సిపిఎం ఆదిలాబాద్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కనుసైగతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49 ని వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు కొమురం భీమ్ కన్జర్ వేషన్ కారిడార్ పేరిట ఆసిఫాబాద్ జిల్లాలో 339 గ్రామాల ఆదివాసీ ప్రజలు తమ ఊరికి ,భూములకు దూరం అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగం పన్నాయని తెలిపారు. రాజ్యాంగంలో లోని 5వ సెడ్డ్యూల్, 1/70 పీసా చట్టాలను ఉల్లంగిస్తూ ఈ జీవోను ఇచ్చారని వివరించారు.
ఆదివాసుల మనుగడ కోసం జరుగుతున్న జిల్లా బంద్ లో ఆదివాసులకు మద్దతుగా పార్టీ శ్రేణులు జిల్లా ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు .








