కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మహాదేవపూర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోట రాజబాబును నియామకమయ్యారు. వారం సాయంత్రం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుర్ జిల్లా శ్రీధర్ బాబు సెక్రటరీ కార్యాలయంలో ఉత్తర్వు కాపీలను రాజబాబుకు అందజేశారు. మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేస్తున్న కోట రాజబాబు గతంలో మహాదేవపూర్ సర్పంచ్ గా శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్గా భూపాలపల్లి జిల్లాలో బీసీకి చెందిన కోట రాజబాబు నియామకంతో బి సీ లకు పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్ నియామకంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఏడాదికి పైగా జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఈనామినేటెడ్ పదవి హృదయపూర్వక మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోట రాజబాబుకు దక్కడంతో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు శిష్యుడు గా, కాంగ్రెస్ పార్టీకి,మంత్రి శ్రీధర్ బాబుకు వినయ విధేయత గా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ గత బిఆర్ఎస్ పాలనలోనూ విపక్షంలో ఉండి సమస్యలపై గల మెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా మంత్రి శ్రీధర్ బాబు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించి కార్యకర్తలు నాయకులకు కష్టపడితే గుర్తింపు ఏలా ఉంటుంది తెలియజేశారు.








