వరంగల్ మహా;
పెండింగ్ లో ఉన్న నల్లా పన్నుల వసూళ్లు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో నల్లా ల సర్వే, నిర్వహణ తీరు పై ఇంజనీరింగ్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది తో ఏర్పాటు చేసిన సమావేశం లో మేయర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రెసిడెన్షియల్ నల్లా లకు చెందిన నల్లా పన్నులు రూ.48 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, అట్టి వసూళ్లను చేపట్టడానికి బిల్ కలెక్టర్ లకు రోజు వారి లక్ష్యాలను నిర్దేశించి 2 నెలల లోపు మొత్తం పన్నులు వసూలు చేసేలా చూడాలని, కమర్షియల్ నల్లా లకు సంబంధించి నగర పరిధి లో 50 మంది వరకు పన్ను చెల్లించడం లేదని, అలాంటి వారికి నోటీసులు అందజేసి పన్నులు సేకరించాలని మేయర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా ఇన్చార్జి ఎస్ ఈ మహేందర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, డి ఈ రాగి శ్రీకాంత్, పర్యవేక్షకులు ఆనంద్ ఏ ఈ హరికుమార్ విజయ లక్ష్మి ఐ టి మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.








