Mahaa Daily Exclusive

  భారీ వర్షం.. ఇంటిలోకి చేరిన నీరు తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు వసతులు కల్పించాలన్న బాధితులు..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
కొంగరకలాన్ లో ఓ ఇంటిలోకి వర్షపు నీరు చేరింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో మెరుపులతో కూడిన కుండపోత వర్షం రావడం జరిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో ఒకసారిగా మేఘావృతమై చల్లని గాలులతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన కుండపోత వర్షానికి ఆదిభట్ల మున్సిపాలిటీ, కొంగరకలాన్ లోని ఇళ్లల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షపు నీటిలో నిత్యవసర సరుకులు, బియ్యము మునిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పలు వాహనాలు నీట మునిగాయి. మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి వసతులు కల్పించాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.