హన్మకొండ మహా;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 5వ డివిజన్ లోని కొత్తూరు ప్రాంతంలో బల్దియా సాధారణ జనరల్ నిధులు రూ.27.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న సి సి రోడ్డు ,డ్రైన్ నిర్మాణ పనులతో పాటు ఇదే ప్రాంతంలో రూ.46.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇంటి నెం: 4- 2- 356 నుండి ఇంటి నెం: 4- 3- 75 వరకు) సి సి రోడ్డు ,డ్రైన్ నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేసారు.
అంతకుముందు కొత్తూరు ప్రాంతంలో గల పోచమ్మ ఆలయంలో శాసన సభ్యులు నాయిని, మేయర్ గుండు సుధారాణి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, డి ఈ రాజ్ కుమార్, ఏ ఈ హరి కుమార్, తదితరులు, ఉన్నారు.
Post Views: 50








