హన్మకొండ మహా;
వరంగల్ కమీషనర్ అఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు పకడ్బందీగా వాహన తనిఖీలు చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా
తెలంగాణ రాష్ట్రంలో దొంగిలించబడిన 4 ద్విచక్రవాహనాలను శుక్రవారం హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి సీతా రెడ్డి సంబంధిత బాధితులకు అప్పగించారు.
హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు రోజువారీ చేసే వాహన తనిఖీలు క్షుణ్ణంగా చేయడం వలన గత 15 రోజులలో దొంగిలించి నడుపుతున్న 4 మోటార్ సైకిళ్లను రికవరీ చేసి, వాటి అసలు యజమానులకు ( బాధితులకు) అప్పగించడం జరిగిందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతా రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ పోలీసులు , సిబ్బంది, పాల్గొన్నారు.
Post Views: 88








