వరంగల్ మహా;
కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుకున్నట్లు పర్యావరణ పరిరక్షణకు ప్రాణవాయు వైన కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించే తాటి చెట్లు కనపడిన చోటల్లా కనికరం లేకుండా నరికి వేస్తున్నారు. దీంతో పర్యావరణం పెను ప్రమాదంలో పడిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరికొన్ని రోజులలో తాటి చెట్లు కనిపించకుండా కనుమరుగు కానున్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో పంటలు పండే భూముల్లో ఉన్న తాడిచెట్లను కొట్టి వేస్తున్నారు. పక్షుల్లో ప్రధానంగా కాకులు గుడ్లు పెట్టే ఆవాసం కేవలం తాటి చెట్లు మాత్రమే, కాకులు లేక పోతె వేప చెట్లు లేవు, వేప చెట్లు లేకపోతే స్వచ్ఛమైన ఆక్సిజన్ లేదు. మిగిలిన పక్షి జాతికి ఆవాసం కూడా ఉండదు. ఎత్తయిన చెట్ల కొమ్మల మీదే తేనెటీగలు తుట్టు కడతాయి, నూటికి తొంబై శాతం పక్షుల మలవిసర్జన నుండి వచ్చే విత్తనాలతోనే మొక్కలు మొలకెత్తాయి. అవి పెరిగిన తరువాత చెట్లు గా మహా వృక్షాలుగా మారుతాయి. అలాంటి చెట్లు లేకపోతే వర్షాలు పడవు స్వచ్ఛమైన గాలి ఉండదు. చెట్లనుంచి గాలి వాయువు రసాయనిక చర్య వలనే మేఘ మధనం జరిగి వర్షాలు సకాలంలో పడతాయి, వర్షాలు లేకపోతే చిత్తడి నేల వుండదు, చిత్తడి నేల లేకపోతే గొంగళి పురుగు సీతా కొక చిలుక గా రూపాంతరం చెందదు, సీత కొక చిలుక పువ్వుల మకరందం గ్రోలుతూ రాల్చే పుప్పొడి వలనే మరొక మొక్క మొలకేత్తుతుంది ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా జరిగే చర్యలు, అలాగే సీతాకోక చిలుకలు లేని భూమిని మనం ఊహించలేమని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఇదంతా ఆలోచిస్తుంటే చాలా ఆందోళనగా బెంగ గాను ఉంది. రాను రాను ఈ భూగోళం ఏమి కానుందో అని మన భవిష్యత్తు తరాలకు మనం ఏం ఇవ్వబోతున్నామని భయం కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా కోట్లాది నిధులు కేటాయించి హరితహారం, సామాజిక అడవుల పెంపకానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం ప్రకృతి నుండి మొలికెత్తి మహా వృక్షంగా నిలుస్తూ కల్లుగీత కార్మికులకు ప్రధాన జీవన ధారమైన తాటి చెట్లు కనబడితే చాలు కొట్టి వేయాలని ఆలోచనలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించి తాటి చెట్లను సంరక్షించడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవు తున్నారని గ్రామీణ ప్రజల తోపాటు పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు అప్రమత్తమై అడవులను సంరక్షించి ముఖ్యంగా తాటి చెట్లను నరికి వేయకుండా కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు స్థలాలలో ఉన్నటువంటి తాటి చెట్లని సంరక్షిం చుకోవలసిన సామాజిక భాద్యత మనందరిపై ఉందని, తాటి చెట్లను సంరక్షించుదాం, కొత్తగా కనీసం ఇంటికి రెండు మొక్కలనైన పెంచుదాం అని ఈ రోజే ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ తీసుకొని ఆచ రణలో పెట్టి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించేందుకు మనందరం కృషి చేయాలని కోరుకుందాం.








