వరంగల్ మహా;
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓంకార్ భవన్ అండర్ బ్రిడ్జి వరంగల్ లో
విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు
ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దిడ్డీ పార్థసారథి, లధేళ్ల శరత్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చుక్క ప్రశాంత్, యార ప్రశాంత్ రెడ్డి, ఏఐఎస్ బి జిల్లా నాయకులు సూర్యతేజ, పిడియస్ యు జిల్లా అధ్యక్షులు అలవాల నరేష్, పిడి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి సాయి రాజేష్, పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మక రవి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. ఎన్ఈపి 2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి.
విద్యార్థి సంఘాల డిమాండ్స్ పై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని 23న తలపెట్టిన విద్యాసంస్థల బంద్ ను విద్యార్థులు , మేధావులు, కవులు ,కళాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా నాయకులు పోలబోయిన రాజు, ఎస్ ఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు చెరుకు రాజేష్, పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి డి వినయ్, పి డి ఎస్ యు జిల్లా కమిటీ సభ్యులు రాంబాబు ఏ ఐ డి ఎస్ ఓ జిల్లా ఉపాధ్యక్షులు మధు తదితరులు పాల్గొన్నారు.








