కారేపల్లి, మహా: వైరా నియోజవర్గ బీఆర్‌ఎస్ పగ్గాలను దివంగత వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ సతీమణి బానోత్ మంజుల కు ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పార్టీ శ్రేణులు వినతిపత్రాన్ని అందజేశారు. శుక్రవారం మదన్‌లాల్ ఇంటికి వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించిన కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్‌కె.గౌసుద్దీన్ కోరారు. కేటీఆర్‌కు వైరా లో పార్టీ పరిస్ధితిని వివరించినట్లు గౌసుద్దీన్ తెలిపారు. బీఆర్‌ఎస్ బలంగా ఉన్నప్పటికీ కొంతమంది మదన్ లాల్ కు వ్యతిరేకంగా పనిచేసి ఓడిరచారని తెలిపారు. దివంగత నేత బానోత్ మదన్‌లాల్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడ్జారని, కార్యకర్తలను కాపాడుకోవటానికి వారి వెంటే ఉన్నారని వివరించినట్లు తెలిపారు. వైరా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శక్తివంతంగా ఉండాలంటే మదన్‌లాల్ సతీమణి బానోత్ మంజుల కు నియోజకవర్గ బాధ్యతలను అప్పజెప్పాలని ఆయన కోరినట్లు గౌసుద్దీన్ తెలిపారు.








