కారేపల్లి, మహా ; కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామపంచాయతీలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణి చేశారు. ఇండ్ల పట్టాలను ఇంచార్జీ ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రాంమ్మూర్తి నాయక్ లు లబ్ధిదారులకు అందజేశారు. పంచాయతీలో 25 మంది పేదలకు పట్టాలను పంపిణి జరిగింది. ఈసందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బానోత్ రాంమ్మూర్తినాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ఇందిరమ్మ ఇండ్ల పధకాన్ని తీసుకవచ్చిందన్నారు. మాటకు కట్టుబడి విడుతల వారిగా పేదలకు ఇండ్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ముందడుకు వేస్తుందన్నారు. పదేండ్లు ఏండ్లుగా ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి వారి కలలు సాకారం చేసిందన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘు, మాజీ ఎంపీటీసీ బానోత్ రమేష్, కాంగ్రెస్ నాయకులు బానోత్ సంతోష్, గుగులోత్ రవీందర్, భూక్యా శ్రీకాంత్, భూక్య కబీర్, రామ, బాష్కు, భూక్యా కుమార్, బానోత్ రవి తదితరులు పాల్గొన్నారు.








