AP: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలి కానీ అరాచకవాదులు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంట్లో నేరముసుగులో ఉన్న రాజకీయ నేతలపైనా చర్చ జరగాలని అన్నారు. 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు.
Post Views: 83








