ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ (53) గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అయితే రెండు కిడ్నీలు పాడవడంతో వాటిని మార్చాలని, రూ.50 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పినట్లు ఆయన కూతురు చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి పూర్తి ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. అయితే కిడ్నీ దాత దొరక్కపోవడంతో వెంకట్ ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.
Post Views: 50








