- గుస్సా
- ధర్మపురి అర్వింద్ పై వివక్ష
- ఇందూరు ఎమ్మెల్యేలపై చిన్నచూపు
- హైదరాబాద్ కరీంనగర్ పార్టీగా మారిన బిజెపి
- కమల నాయకత్వంపై ఇందూరు ప్రజల గుర్రు
- కేసీఆర్ కుటుంబంపై పోరాడి రాష్ట్రంలో పార్టీకి ఊపుతెచ్చిన తొలి నాయకుడు
- నాయకత్వ పగ్గాలు హైదరాబాద్ కు కాకుండా జిల్లాలకు దక్కితేనే పార్టీవిస్తరిస్తుందని వాదించిన లీడర్
- బండికి అధ్యక్షపీఠం దక్కేందుకు కారణమైన తొలి నాయకుడు
- కీలక సమయాల్లో ఇందూరును పక్కనపెడుతున్న నాయకత్వం
- కష్టపడడమే తప్ప లాబీయింగ్ తెలియని అర్వింద్
- ఇందూరు నేతలకు పగ్గాలిస్తే.. పార్టీ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదంటున్న క్యాడర్
Exclusive
(హైదరాబాద్, వేదిక బ్యూరో)
ధర్మపురి అర్వింద్ ఫైర్ బ్రాండ్. కేసీఆర్ కుటుంబాన్ని ఢీకొట్టి ఓడించి తెలంగాణలో ఊహించడానికే సాహసించని కాలంలో విజయబావుటా ఎగరేసిన నాయకుడు. కేసీఆర్ పై తొలిధిక్కార స్వరం ఆయనే. బిజెపి నాయకత్వపగ్గాలు హైదరాబాద్ దాటి జిల్లాలకు ఇవ్వాలని నినదించిన నేతా ఆయనే. బండిసంజయ్ కు బిజెపి పగ్గాలు దక్కడానికి ఆయనా ఓ కారణం. ఎన్నోవైరుధ్యాలు వైవిధ్యాలున్నా ఇందూరు జిల్లాను కాషాయకంచుకోటగా చేసి తాను గెలవడంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు జిల్లానుండి గెలిచేలా బాటలు పరిచిన నాయకుడు. మోడీ భక్తుడు. కాషాయమోధుడు. కష్టపడడమే తప్ప లాబీయింగ్ తెలియని లీడర్. బిజెపి హైదరాబాద్ కరీంనగర్ పార్టీగా మారిపోగా, ఇందూరు ప్రజలు బిజెపి నాయకత్వవివక్షపై గుర్రుగా ఉన్నారు. కేసీఆర్ కూతురిని ఓడించి ఆ పార్టీని తొలిదెబ్బ తీసిన అర్వింద్ కు కేంద్ర బెర్త్ దక్కలేదు. కేసీఆర్, రేవంత్ ఇద్దరు సిఎంలను ఓడించిన కేవిఆర్ కు, ఆర్మూర్ లో సంచలనమైన రాకేష్ రెడ్డి, నిజామాబాద్ సిటీలో పట్టుబిగించిన ధన్ పాల్ పార్టీ ఇస్తున్న ప్రయారిటీ ఏంటి? జస్ట్ అస్కింగ్ అంటూ ఇందూరు ప్రశ్నిస్తోంది.
……







