Mahaa Daily Exclusive

  గ్రామమంతా ఏకమై శబరిమాత వేడుకై ..!

Share

తలమడుగు మహా:
ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో శ్రావణమాసం ప్రారంభమైన సందర్భంగా శ్రీ సద్గురు శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమాన్ని శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది.వారు మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకమై ఈ నెలరోజులపాటు అఖండ జ్యోతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేయడం అనేది ఎంతో అభినందించేదగ్గ విషయమని ఈ కాలంలో గ్రామమంతా ఒక్కటిగా పనులన్నీ వదులుకొని భక్తిశ్రద్ధలతో నెల రోజులపాటు ఈ అఖండ జ్యోతి కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామానికి ఆ ప్రజలకు ఈ శబరీ మాతమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, కిరణ్ కుమార్, కేదారేశ్వర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గంగన్న, అభిరామ్ రెడ్డి, గంగాధర్, రవికాంత్ యాదవ్, రమకాంత్ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.