Mahaa Daily Exclusive

  గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి కృషి చైర్మన్ కొట్నాక తిరుపతి..!

Share

కాటారం, మహా :
గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి కేసు కృషి చేస్తున్నట్లు, సంస్థ బలోపేతానికి రూ 80 కోట్ల ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఇచ్చినట్లు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి తెలిపారు. శుక్రవారం మహాదేవపూర్ గిరిజన సహాకారా సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజన కో-ఆపరేటివ్ సంస్థ (జి సి సి )అభివృద్ధి చెందినట్లు, గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు. సంస్థ డైరెక్టర్లు సిబ్బంది చైర్మెన్ ను సన్మానించారు. సంస్థ నిర్వహిస్తున్న డి ఆర్ సి గోదాం, గ్యాస్ గోదాం, ఎం ఎల్ ఎస్ గోదాం లను తనిఖీ చేశారు. జి సి సి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే పెట్రోల్ పంపు కు స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లో గిరిజన ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపారాని ఆయన అన్నారు,తెలంగాణా రాష్ట్రము ఏర్పడ్డాక పాలకుల నిర్లక్షానికి ఆదివాస గిరిజనులు వెనుకబడ్డారని , తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చొరవతో తిరిగి గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.గిరిజన సంస్థల బలోపేతానికి ఏనుబై కోట్ల రూపాయలతో మంజూరుకోసం ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కి ఉపముఖ్యమంత్రి కి అందించినట్లు అనిధులతో కార్పొరేషన్ లో వున్న సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు,ఈ ప్రాంతం ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం గిరిజన సహాకరా సంస్థ అభివృద్ధి కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో మహాదేవపూర్ జీసీసీ కి పక్కా భవనం, ప్రహరీ గోడ, పిట్రోల్ పంపు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని గిరిజన అభివృద్దె ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.ఈ సమావేశం లో గిరిజన సహకార సంస్థ డైరెక్టర్లు కాల్నేని రాములు, సమ్మన్న, శంకరమ్మ, సంస్థ డివిజనల్ మేనేజర్ వాణి, ఇంచార్జి మేనేజర్ దేవ్ సింగ్,గోదాం ఇంచార్జీలు రాజేశం, సతీష్, తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.