Mahaa Daily Exclusive

  పలిమెల మండలంలో భారీ వర్షాలకు తెగిన రోడ్డు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు రిపేర్ చేయాలంటున్న ..!

Share

కాటారం, మహా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు
పలిమెల మండలంలో రోడ్డు తెగి రవాణా సౌకర్యం దెబ్బతిన్నది.గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలిమెల మండలంలోని సర్వాయిపేట- బూరుగుగూడెం గ్రామాల మధ్యలో నల్లవాగు వరద ఉధృతి కి ఆర్&బి రోడ్డు సగానికి పైగా కోతకు గురికావడం తో రవాణా సౌకర్యం నిలిచిపోయింది.దమ్మురు, బూరుగుగూడెం, నీలం పల్లి, ముకునూరు గ్రామాల ప్రజల కు ప్రయాణ సౌకర్యం కష్టంగా మారింది.దీంతో మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య తో పలిమేల మండల కేంద్రంతో పాటు మహాదేవపూర్ మండల కేంద్రానికి చేరుకోవటానికి వాగు అవతలి వైపున ఉన్న
దమ్మురు, బూరుగు గూడెం, నీలం పల్లి, ముకునూరు గ్రామాల ప్రజల ప్రయాణానికి అనేక అవస్థలు పడుతున్నారు కాలినడకన లేదా బైక్ ల మీదనే రావాల్సి వస్తుంది నాలుగు చక్రాల వాహనాలు బస్సులు వెళ్లకుండా రోడ్డు బాగా దెబ్బతిన్నది.కోతకు గురైన రోడ్డును ఎంపీడీవో ప్రకాష్ రెడ్డి పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను పంపించనున్నట్లు తెలిపారు.రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.