Mahaa Daily Exclusive

  శ్రీ గోవిందాద్రి సేవాదళ్ లోగో ఆవిష్కరణ పాల్గొన్న కార్పొరేటర్ చింతాకుల అనిల్ ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ నగరంలో ప్రాచీన ప్రసిద్ధిగాంచిన గోవిందరాజస్వామి దేవాలయ మెట్ల ప్రాంగణంలో గోవిందాద్రి సేవాదళ్ క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సేవాదళ్ యొక్క లోగో ను ఆవిష్కరించారు. భవిష్యత్తులో గోశాల నిర్వహణ, భజగోవింద, దళిత గోపాలం కార్యక్రమాల తో పాటు కృష్ణాష్టమి వేడుకల గురించి, సంస్థ సంస్థగత విషయాల గురించి కార్యవర్గం చర్చించడం జరిగింది. ఈసారి గోవింద రక్ష కార్యక్రమానికి వరంగల్ నగరంలో ఉన్న మహిళలు ప్రముఖులందరిని ఆహ్వానించాలని నిర్ణయించారు. అతికొద్ది కాలంలోనే గోవిందాద్రి సేవాదళ్ ను హిందూ సంఘాల ఐక్యవేదిక గా గుర్తించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సేవాదళ్ గౌరవాధ్యక్షులు చింతాకుల అనిల్ కుమార్, రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్, సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆడిక రంజిత్ కుమార్, అధ్యక్షులు యాట ప్రతాప్, సేవాదళ్ సహాయ కార్యదర్శి ధనలక్ష్మి , సేవికాదళ్ ఉపాధ్యక్షురాలు పట్టాభి రాజేశ్వరి, సేవాదళ్, సేవికాదళ్ కార్యవర్గం, తదితరులు పాల్గొన్నారు.