వరంగల్ మహా;
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఆదివారం ఉదయం తెలంగాణా జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యా మిశ్రా, ఐ.పి.ఎస్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సౌమ్యామిశ్రా కు భద్రకాళి శేషు అయ్యగారు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ మహా మండపంలో అర్చకులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించగా ఆలయ కార్యనిర్వహణాధికారి, సహాయ కమీషనర్ రామల సునీత ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌమ్యామిశ్రా వెంట శుభం ప్రకాష్ ఐపి ఎస్ తదితర పోలీసు అధికారులు ఉన్నారు.
Post Views: 112







