Mahaa Daily Exclusive

  విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్..!

Share

హన్మకొండ మహా;

పదవీ విరమణ చేసిన పోలీస్‌ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సుధీర్ఘ కాలం పని చేసి పదవీవిరమణ చేసిన పోలీస్‌ అధికారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదివారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేసారు.
ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ మీ సేవలు నేటి తరం పోలీసులకు అదర్శంగా నిలుస్తుందని, నేటి ఈ ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని, మీరు అందించిన సేవలు మరువమని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి, శ్రీనివాస్, ఆర్. ఐలు నాగయ్య, సతీష్, ఆర్ ఎస్ ఐ శ్రవణ్ తో పాటు పదవీ విరమణ పొందిన అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.