వరంగల్ మహా;
స్నేహం ఓ మధురమైన అనుభూతి దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఆటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు స్నేహ భావం ఉంటుంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు స్నేహానికి ఎటువంటి కుల మతాలు, ఎల్లలు గాని లేవు. ప్రతి ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి వారం రోజున ప్రపంచమంతా ఫ్రెండ్షిప్ డే ఘనంగా నిర్వహించు కుంటారు.
ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గ్రేటర్ వరంగల్ లో ఫ్రెండ్షిప్ డే ను ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా వరంగల్ నగరంలోని 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 100 మంది ఈ వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్నడం ఓ విశేషం. ఆదివారం మడికొండ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఈ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
ఉపాధ్యాయులు, వ్యాపారులు, నగర ప్రముఖులు పిల్లా పాపలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గందే కల్పన నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆటవిడుపుగా ఉండేందుకు ఇలాంటి వేడుకల్లో ఒకరినొకరు కలుసుకొని బాగోగులు చర్చించుకుని కొద్దిపాటి సమయాన్ని మిత్రులతో గడిపేందుకు కేటాయించుకోవడం నేటి యాంత్రిక యుగంలో జీవనశైలి మారుతున్న క్రమాన్ని సరిదిద్దుతుందని అన్నారు. ఈ వేడుకల్లో
ఎన్పీడీసీఎల్ ఎస్సీ గాందె మల్లికార్జున్ , డి ఇ లు అమర్నాథ్, సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, సత్యం , రవిచందర్, శంకర్ రావు , వద్దిరాజు నివేదిత రమ, అరుణ తో పాటు వ్యాపారవేత్తలు పాల్గొని వేడుకలను ఆస్వాదించారు.








